‘శివ’ చిత్రం మళ్లీ రిలీజ్

shiva-release రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన ‘శివ’ సినిమా విడుదలై అక్టోబర్ 5కు 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో లో నిన్న ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ‘శివ’ సినిమాకు పని చేసిన నటులు, టెక్నీషియన్లు.. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల, ఎస్ గోపాల్ రెడ్డి, జెడి చక్రవర్తి, తనికెళ్ళ భరణి, కృష్ణవంశి, ఉత్తేజ్, శివ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

నాగార్జున మాట్లాడుతూ… నా జీవితాన్ని మార్చిన సినిమా శివ. జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. కాని, బాధపడను. ఎందుకంటే ‘శివ’ అనే సినిమాలో నటించి, నిర్మించి ఒక కరెక్ట్ పని చేశాను. ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను నవంబర్ నెలలో తిరిగి విడుదల చేస్తున్నాం. డిజిటల్ రీమాస్టర్ ప్రింట్ తో సుమారు 100 థియేటర్లలో ‘శివ’ సినిమాను విడుదల చేస్తున్నాం అని నాగార్జున తెలిపారు.