అల్లు అర్జున్ ఫ్రీగా చేసాడు

allu-arjun-rudramadeviతెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కుతుంది..ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లో చాల మంది ఆర్టిస్ట్ లు నటిస్తున్నారు. అందులో ఒకరు అల్లు అర్జున్.

ఈ చిత్రం లో గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. తన పార్ట్ కి షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి చేసాడు. ఇటీవలే ఈ చిత్ర డైరెక్టర్ గుణశేఖర్ అల్లు అర్జున్ కి రెమ్యునరేషన్ గురించి మాట్లాడటానికి వెళితే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ వద్దని అన్నాడు. తెలుగు హిస్టరీ మీద చేస్తున్న ఈ చిత్రానికి నేను ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకదల్చుకోలేదు అని చెప్పి గుణశేఖర్ వెనక్కి పప్పాడట. దీంతో ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు బన్నీ ని అభినందించడం మొదలుపెట్టారని సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో
అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించగా , అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.