నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ ఎన్నికల ప్రచారం!

Varun-Tej
మెగా హీరో నాగబాబు కుమారుడు హీరో వరుణ్‌తేజ్ అమలాపురంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలన్నీ అయిపోయాయి కదా! ఇప్పుడు ఎన్నికల ప్రచారమేంటి? అనుకుంటున్నారా..? అదేం లేదండీ ఆయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో నటిస్తున్న ‘ముకుంద’ చిత్ర షూటింగ్ అమలాపురంలో పరిసరాలలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం లో కీలకమైన మున్సిపల్ చైర్మర్ ఎన్నికల సన్నివేశాలను ప్రస్తుతం ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. వరుణ్‌తేజ్ పట్టణంలోని గారపాటి వీధిలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న సన్నివేశాలను షూట్ చేశారు. లియో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఈ చిత్రం లో చిప్రతినాయకునిగా రావు రమేష్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి మిక్కి .జె.మేయర్. సంగీతాన్ని అందిస్తున్నాడు.