మెగాస్టార్ మళ్లీ మేకప్ వేసుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. చిరు 150వ సినిమాకి ముహూర్తం ఫిక్సయ్యింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజే చిరు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయని చిరు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే చిరు దర్శకుడి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని, కథకు తగినట్టు తన శరీరాకృతిని మార్చుకొంటున్నారని, అందుకే జిమ్లో తెగ కసరత్తు చేస్తున్నారని టాలీవుడ్ టాక్. చిరు ఈమధ్య నాగ్ షో – మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పోగ్రాంలో చిరు తన సినిమా గురించి ఓ క్లూ ఇచ్చినట్టు తెలుస్తోంది. 150వ సినిమాకి దర్శకుడు ఎవరు, ఎప్పుడు ప్రారంభం కానుంది? ఈ విషయాలపై చిరు మాట్లాడాడట. మరోవైపు రామ్చరణ్ కూడా డాడీ సినిమాకి గ్రౌండ్ వర్క్ పూర్తి చేశాడు. అందులో తాను ఓ పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. 22వ తారీఖున కొబ్బరి కాయ్ కొట్టుకోవడం గానీ, లేదంటే… ఈ సినిమా గురించిన ఓ స్పష్టమైన సమాచారం ఇవ్వడం గానీ జరుగుతుందని టాలీవుడ్ టాక్.