బాహుబ‌లిలో త‌మిళ స్టార్ హీరో?!

sury
ప్ర‌భాస్ – రాజ‌మౌళిల ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం బాహుబ‌లి… రోజుకో ప్ర‌త్యేక‌త సంత‌రించుకొంటోంది. స్టార్ బ‌లంతో.. మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ముందుకొస్తోంది. ఈ సినిమాలో ఇప్పుడు మ‌రో స్టార్ చేర‌బోతున్నాడు. అత‌నెవ‌రో కాదు… త‌మిళ న‌టుడు సూర్య‌. బాహుబ‌లిలో
జయదేవ రాణా అనే పాత్ర ఒకటుందట. ఈ పాత్ర‌లో సూర్య అయితే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ని స‌మాచార‌మ్‌. బాహుబ‌లిలి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కిస్తున్నారు. అందుకే త‌మిళంలో తెలిసిన న‌టుడినే ఎంచుకోవాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌. సో.. ఆ పాత్ర సూర్య‌కి యాప్ట్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు స‌మాచారం. సూర్య‌కి అటు త‌మిళంలోనూ ఇటు తెలుగులోనూ మార్కెట్ ఉండ‌డం… క‌లిసొచ్చే అంశం. ఈ విష‌య‌మై సూర్య‌కి రాజ‌మౌళి సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. చివ‌రికి ఏం అవుతుందో, ఈ పాత్ర‌కు ఎవ‌రిని తీసుకొంటారో చూడాలి.