సమంతకు సినిమా కష్టాలు

samntha
సమంతకు ఒక్కసారిగా సినిమా కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో తానూ హీరోయిన్ గా చేసిన అంజాన్ చిత్రం ఆడియో కు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఆమెనే ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది. నిన్న (మంగళ వారం ) అంజాన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరుకావడానికి బయలుదేరింది సమంత. చివరి నిముషంలో ఫ్లైట్ డిలే అయ్యింది. తన లగేజ్ మొత్తం ట్రాన్సిట్ లో ఉండిపోయింది. తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యింది. మూడ్ మొత్తం పాడైపోయింది. ఒకదాని వెంట మరొకటి… సవ్యంగా ఒక్క పని కూడా జరగడం లేదట. దీంతో విసుగెత్తిన సామ్…’వరస్ట్ డే ఎవర్’ అంటూ ట్విట్టర్లో తన అసహనాన్ని వ్యక్తపరిచింది.