కేసీఆర్ కు.. బాబు లేఖాస్త్రాం!

kcr babu
విద్యార్థుల భవిష్యత్ కోసం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ అడుగు ముందుకేశాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఏర్పడిన విద్యార్థుల ఫీజు రియింబర్స్ మెంట్, ఆడ్మిషన్లు..తదితర సమస్యలను సానుకూల వాతావరణంలో
పరిష్కరించుకోవడానికి బాబు చొరవ చూపారు. తాజాగా, విద్యార్థుల విషయంపై చంద్రబాబు టీ-ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.

2014-15 ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించాలని లేఖలో కోరారు. ఇరు రాష్ట్రాలు కూడా పునర్విభజన నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఉన్నత విద్యలో సమానవకాశాలు ఉన్నాయని, విద్యార్థుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో వుంచుకొని వెంటనే అడ్మిషన్లు బాబు.. కేసీఆర్ ను కోరారు. కాగా, 1956కు ముందున్న వాళ్లనే స్థానికులుగా పరిగణిస్తామని.. వారికి మాత్రమే ఫీజు రియింబర్స్ మెంట్ ను టీ-ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.