అవ‌న్నీ నాన్‌సెన్స్ అంటోన్న‌ శ్రుతి

Shruthi-Hassanసినిమావాళ్ల‌కు సెంటిమెంట్లు కాస్త ఎక్కువే! కొంత‌మంది ముహూర్తం ప్ర‌కారం ఫాలో అయిపోతారు. మ‌రికొంద‌రు ఆ సినిమాలో అలా చేస్తే క‌లిసొచ్చింది క‌దా, ఈ సినిమాలోనూ అదే ఫాలో అయిపోదాం అనుకొంటారు. శ్రుతిహాస‌న్‌కీ అలాంటి సెంటిమెంట్లు ఉన్నాయా?? అని అడిగితే “నాన్‌సెన్స్‌… సెంటిమెంట్లేంటి..?? వాటిని న‌మ్ముకొంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేం..“ అంటోంది. “సెంటిమెంట్ల‌ని కాదు.. నేను క‌మిట్‌మెంట్‌ ని న‌మ్ముకొన్న వ్య‌క్తిని. నేను చేసిన ప‌నే నాకు ఫ‌లితాన్ని ఇస్తుంది. లేని పోని లెక్క‌లు వేసుకొంటే, చేయాల్సిన ప‌ని చేయ‌లేం. హిట్ పెయిర్ అనే ప‌దాన్ని ప‌ల‌క‌డానికి కూడా నాకు ఇష్టం ఉండ‌దు. క‌థ బాగుంటే. సినిమా తీసిన విధానం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితే సినిమాలు ఆడ‌తాయి. జోడీ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటే సినిమాలు న‌డ‌వ‌వు..“ అని త‌న అభిప్రాయాన్ని నిర్మొహ‌మాటంగా చెప్పేస్తోంది.