గోవిందుడు.. ప‌క్కా క్లాస్‌

ramcharn
మాస్‌, యాక్ష‌న్ బాట నుంచి కాస్త ప‌క్క‌కొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ర‌చ్చ‌, నాయ‌క్‌, ఎవ‌డు.. మూడూ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్లే. అందుకే రొటీన్ అని ఫీల‌య్యాడేమో. ఇప్పుడు క్లాస్ బాట ప‌ట్టాడు. అందుకే కృష్ణ‌వంశీతో గోవిందుడు అంద‌రివాడేలే చేస్తున్నాడు. ఈ సినిమాని సాధ్య‌మైనంత క్లాసీగా తీయాల‌ని కృష్ణ‌వంశీకి సూచించ‌డాట వ‌ర్మ‌. ఇలాగైతేనే ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి ద‌గ్గ‌ర అవ్వ‌గ‌లుగుతాన‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నాడేమో..? మాసీ డైలాగులూ, కావాల‌ని జోడించే ఫైట్లకూ ఈ సినిమా నుంచి మిన‌హాయింపు ఇచ్చేసిన‌ట్టు టాలీవుడ్ స‌మాచార‌మ్‌. త‌న గెట‌ప్‌, బాడీ లాంగ్వేజ్‌. డైలాగ్ డెలివ‌రీ… ఈ మూడింటిలోనూ మాస్ః ఛాయ‌లు ఏమాత్రం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ట‌. సాధార‌ణంగా కృష్ణ‌వంశీ సినిమాలంటే… న‌టుడిలోని వేరే కోణం బ‌య‌ట ప‌డుతుంది. మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ అంతా – కృష్ణ‌వంశీతో జ‌త క‌ట్టి `ఉత్త‌మ న‌టులు` అనిపించుకొన్న‌వాళ్లే. ఇప్పుడు చ‌ర‌ణ్‌కీ అలా అనిపించుకోవాల‌ని వుందేమో..?!