నందమూరి బాలకృష్ణ – ఎస్.ఎస్.రాజమౌళి!!
ఈ కాంబినేషన్ కోసం బాలయ్య అభిమానులు ఎప్పటినుంచో వెయిటింగ్. ఈ నిరీక్షణ త్వరలోనే తీరబోతోంది. బాలయ్య వందో సినిమా కోసం భారీగా కసరత్తులు జరుగుతున్నాయి. నిర్మాత సాయి కొర్రపాటి ఈ ప్రాజెక్ట్‌ని సెట్ చేసే పనిలో పడ్డారు. బాలయ్య సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వినవస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు సెట్ కావొస్తోంది. ఇటీవలే బాలయ్య రాజమౌళిని పిలిచినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్యా వందో సినిమా ప్రస్తావన వచ్చిందట. బాలయ్యతో సినిమా చేయడానికి జక్కన్న కూడా ఓకే అన్నాడట. అయితే ఎలాంటి కథ… అనే విషయంపై చర్చలు ఓ కొలిక్కి రాలేదు. బాహుబలి పూర్తయ్యేలోగా కథపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆదిత్య 369లాంటి సైన్స్ ఫిక్షన్ అయితే బాగుంటుందని బాలయ్య అభిప్రాయం. అలాంటి కథ రెడీ చేసే పనిలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంంబినేషన్ గురించి ఓ మంచి కబురు వినే అవకాశం ఉంది.