ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

 

Governorrr

గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి శనివారం శాసనసభలో ప్రసంగించారు. రాష్ట్ర విభజన తీరు ప్రజలకు తీవ్ర ఆవేదన ను మిగిల్చిందని గవర్నర్ అన్నారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యంశాలు :

* సుస్థిరత, అభివృద్ధి కాంక్షిస్తూ ప్రజలు ఓటేశారని

* కొత్త రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయి నుంచి నిర్మించుకోవాలి

* విభజన బిల్లులోని అంశాలు అమలయ్యేలా కేంద్రం చూడాలి

* ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని, ప్రత్యేక హోదా చర్యలను కేంద్రం వేగవంతం చేయాలి

* ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పాలన

* 15 ఏళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

* రెవెన్యూ లోటును భరించాలని కేంద్రానికి వినతి

* గత పదేళ్ల పాలనలో అవకతవకల వల్ల రాష్ట్రం సంక్షోభంలో ఉంది

* నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో వ్యయంపై సమీక్ష జరగాలి

* అన్ని అంశాలపై శ్వేతపత్రం విడుదల చేస్తాం

* వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో అధిక వృద్ధి సాధిస్తాం

* సీమాంధ్రను ఐటీ, ఇండస్ట్రీయల్ హబ్‌గా మారుస్తాం

* పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడానికి చర్యలు

* తుంగభద్ర బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని కోరతాం

* రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, గృహాలకు 24 గంటల విద్యుత్ సరఫరాకు కృషి

* ఏపీలో పెండింగ్ ప్రాజెక్ట్‌ లన్నీ పూర్తి చేసి, జల విద్యుత్ ఉత్పత్తి అవకాశం ఉన్నచోట ప్లాంట్ల ఏర్పాటు

* సోలార్ పంపుసెట్ల కోసం 75 శాతం ప్రభుత్వ రాయితీ

* రైతుల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది

* వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్

* పంటల మద్దతు ధరకు ప్రత్యేక విధానం

* డ్రిప్ ఇరిగేషన్, జిల్లాకో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు

* నిత్యావసరాల ధరలు అదుపులో ఉంచేందుకు కృషి

* మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

* మహిళల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు వ్యవస్థను ఏర్పాటు

* మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

* కుటీర లక్ష్మీ పేరుతో మహిళలకు శిక్షణ, ఆర్థిక సాయం అందజేస్తాం

* కాపులను బీసీలో చేర్చే అంశంపై కమిషన్ ఏర్పాటు

* బీసీలకు ప్రత్యేక బడ్జెట్

* ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు

* ఎన్టీఆర్ ఆరోగ్య కార్డు పథకం కిందకి ఆరోగ్యశ్రీ

* త్వరలోనే ఉద్యోగాలను భర్తీ

* విభజన తర్వాత ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని, ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

* ఏపీలో మూడు మెగా సిటీలు, మరో 12 నగరాలను అభివృద్ధి

* హైస్పీడ్ రైళ్లతో అన్ని జిల్లాలకు అనుసంధానం చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.