ఇద్ద‌రూ ల‌వ్వాడుకొంటున్నారా?

priyan
అనిరుథ్ మామూలోడు కాదు. చూడ్డానికి చిన్న గుంట‌డులా ఉంటాడు గానీ… చాలా వ్య‌వ‌హారాలే న‌డుపుతున్నాడు. కొల‌వెరీ డీ… అంటూ యావ‌త్ ప్ర‌పంచాన్ని త‌న మైకంలో దింపేశాడు. అంతేనా… ల‌వ్వాట‌లో కూడా య‌మ స్పీడుగా దూసుకుపోతున్నాడు. కొల‌వెరీ స‌మ‌యంలోనే క‌థానాయిక ఆండ్రియాకు ఘాటైన ముద్దులిస్తూ కెమెరాకు పోజులిచ్చాడు. కొల‌వెరీ పాట‌క‌న్నా.. ఈ వెర్రి మ‌రింత జ‌నానికి ఎక్కేసింది. అనిరుథ్‌లోని కొత్త‌కోణం ఒక‌టి బ‌య‌ట‌కు వచ్చింది. ఆ త‌ర‌వాత నుంచీ… ఏదో విధంగా అనిరుథ్ పేరు.. అమ్మాయిల విష‌యంల బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంది. తాను ప‌నిచేసే సినిమాల్లోని హీరోయిన్ల‌తో చాలా క్లోజుగా ఉంటున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఆ జాబితాలో ప్రియాఆనంద్ కూడా చేరిపోయింది.

ప్రియానంద్ న‌టించిన‌ ‘ఎథిర్ నీచల్’ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. అప్ప‌టి నుంచీ వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే పుకారు మొద‌లైంది. అది ఇప్పుడు తీవ్ర‌రూపం దాలుస్తోంది. అనిరుధ్‌తో ప్రియ చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంద‌ని చెన్నై వ‌ర్గాలు గుసగుస‌లాడుకొంటున్నాయి. అయితే ప్రియానంద్ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. అనుకొంటే అనుకోనీ… అంటూ లైట్ తీసుకొంటోంది. ఈ వ్య‌వ‌హారం ఎందాక వెళ్తుందో మ‌రి.