శ్రుతిహాసన్పై మరో హాట్ న్యూస్. భారత క్రికెటర్ సురేష్ రైనాతో శ్రుతి డేటింగ్ చేస్తోందని… వీరిద్దరి మధ్య రహస్య బంధం కొనసాగుతోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శ్రుతి మెంటర్ గా వ్యవహరిస్తోంది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం మొదలైందట. ప్రతి మ్యాచ్ కి ముందు రైనాకి శ్రుతి ఆల్ ది బెస్ట్ చెప్పడం అలవాటుగా మార్చుకొందట. మ్యాచ్ లు లేనప్పుడు ఇద్దరూ కలుస్తున్నారని కూడా చెప్పుకొంటున్నారు. అయితే సురేష్ రైనా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చాడు. `మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. శ్రుతితోనే కాదు నేను ఎవరితోనూ డేటింగ్లో లేను` అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే… వీరిద్దరి మధ్య ప్రేమ బంధం పక్కా… అని చెన్నై పత్రికలు ఘంటాపథంగా చెబుతున్నాయి. మరి వీటిపై శ్రుతి రియాక్షన్ ఏమిటో చూడాలి మరి.