రెండో రోజు రూ.4 కోట్లు

manamతొలిరోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.3.5 కోట్లు వ‌సూలు చేసింది మ‌నం. రెండో రోజు మ‌నం వ‌సూళ్లు మ‌రింత పెరిగాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.4 కోట్ల వ‌ర‌కూ వ‌సూళ్లు సాధించింది. అంటే రెండు రోజుల‌కూ రూ. 7.5 కోట్లు సాధించింద‌న్న‌మాట‌. పెద్ద సినిమాల రాబ‌డితో పోలిస్తే… మ‌నం వ‌సూళ్లు కాస్త త‌క్కువే అని చెప్పాలి. తక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డం వ‌ల్ల‌, సీ సెంట‌ర్‌లో వ‌సూళ్లు కాస్త మంద‌గించ‌డం వ‌ల్ల‌…. మ‌నంకి భారీగా సొమ్ము చేసుకోలేక‌పోతోంది. ఏ సెంట‌ర్ల‌లో మ‌నంకి భారీ స్పంద‌న వ‌స్తోంది. మ‌ల్టీప్లెక్స్‌ల‌న్నీ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఈ తాకిడి మ‌రో వారం ప‌దిరోజుల పాటు ఇలాగే కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.