మౌన‌ముని మాట్లాడుతున్నాడు!

Raghavendra-Rao

నేను కాదు… నా సినిమాలే మాట్లాడాలి అనే త‌త్వం ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావుది. అందుకే ఆయ‌న మైకు ఎప్పుడూ ముట్టుకోరు. ఎన్ని వేడుక‌ల‌కు హాజ‌రైనా… క‌నీసం మొక్కుబ‌డిగా కూడా మాట్లాడ‌రు. సినిమా విడుద‌లకు ముందు మీడియాకు ఇంట‌ర్వ్యూలు కూడా ఇవ్వ‌రు. ఎంత క‌వ్వించినా ముసిముసిగా న‌వ్వుతారంతే. అలాంటి కె.రాఘ‌వేంద్ర‌రావు తొలిసారి మాట్లాడ‌బోతున్నారు. మీడియా సాక్షిగా ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌బోతున్నారు. రాఘ‌వేంద్ర‌రావు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి స‌రిగ్గా 50 వ‌సంతాలు. ఈ సంద‌ర్భంగా ఓ టీవీ ఛాన‌ల్ రాఘ‌వేంద్ర‌రావుపై ఓ స్పెష‌ల్ పోగ్రాంని నిర్వ‌హిస్తోంది. ఈ పోగ్రాంల‌తో రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడ‌బోతున్నారు. ప్రేక్ష‌కులు అడిగే చిలిపి ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానాలు ఇవ్వ‌బోతున్నారు. రాఘ‌వేంద్ర‌రావుతో ప‌నిచేసిన క‌థానాయిక‌లంతా.. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచార‌మ్‌. మొత్తానికి మౌన‌ముని పెద‌వి విప్ప‌బోతున్నాడ‌న్న‌మాట‌.