’మంత్రిపదవి’ పై ఆసక్తి లేదు!

ktr

తెరాస తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక, కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీష్ రావు, కేటీఆర్, కవితలకు మంత్రి పదవులు దక్కనున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా, తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదని స్టేట్ మెంట్ ఇచ్చి కేటీఆర్ షాక్ ఇచ్చాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆనందంగా ఉందని, మంత్రి పదవిపై ఆసక్తి లేదన్నారు. అయితే, పార్టీ నిర్ణయం, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. కాగా, రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.