పోటుగాడి పెళ్లెప్పుడు?

manchu manoj
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచిల‌ర్‌… మంచు మ‌నోజ్‌. మీ పెళ్లెప్పుడు? అని ఎప్పుడు అడిగినా… ఈయేడాదే.. అని చెప్పి త‌ప్పించుకొంటుంటాడు. రేపు మ‌నోజ్ పుట్టిన రోజు. బ్యాచిల‌ర్‌గా ఇదే మీ చివ‌రి పుట్టిన రోజా? అని అడిగితే ”మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నా. ఇప్పుడూ అదే మాట మీద ఉంటా..” అంటూ న‌వ్వేస్తున్నాడు. ”మా ఇంట్లో వాళ్లు కూడా పెళ్లికి ఇబ్బంది పెడుతున్నారు. పెళ్లి చేసుకొంటావా? లేదా? అని బెదిరిస్తున్నారు. కానీ మ‌న చేతుల్లో ఏమీ లేదు క‌దా? నా దృష్టంతా సినిమాల‌పైనే ఉంది. పెళ్లి ఎప్పుడ‌నేది నేనేం చెప్పలేను. భ‌గ‌వంతుడు ఏదో ఒక‌టి రాసి పెడ‌తాడు. అది ఆ టైమ్‌కే జ‌రుగుతుంది” అంటున్నాడు. మంగ‌ళ‌వారం ఈ పోటుగాడి పుట్టిన రోజు. అంద‌రూ విషెష్ చెప్పండి మ‌రీ..!