ఏపీ ’ఫస్ట్ సీఎం’.. చంద్రబాబు!

chandrababu

ఓట్ల లెక్కింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీమాంధ్రలో సైకిల్ జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాల ప్రకారం సైకిల్ 100స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. చంద్రబాబు అభివృద్ధి మంత్రానికి సీమాంధ్ర ప్రజలు పట్టం కట్టారు. ఇక, అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయిగా కనిపిస్తోంది. సైకిల్ జోరును చూసి తెలుగు తముళ్లు ఖుషి అయివుతున్నారు. తెలుగు తముళ్లు సంబరాల్లో మునిగిపోయారు.