బన్నీ దర్శకుడితో టచ్ లో వున్నాడట

Ramcharan-surender-reddy
‘అతనొక్కడే’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సురేందర్ రెడ్డి ‘కిక్’ చిత్రం భారీ విజయం సాదించి స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇక లేటెస్ట్ ‘రేసుగుర్రం’ తో బన్ని కి అదిరిపోయే హిట్ ఇచ్చి ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ లిస్టు లో చేరిపోయాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడీ లిస్టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేరాడు. ‘రేసుగుర్రం’ చూశాక చరణ్, సురేందర్ కి ఫోన్ చేశాడట. తనకు తగ్గా మంచి సబ్జెక్ట్ తయారుచేయమని చరణ్ కోరినట్టు సమాచారం. దీనికి సురేందర్ కూడా వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం వీరీ మధ్య చర్చలు జరుగుతున్నాయిని ఇన్ సైడ్ టాక్.