రజనీకాంతా… మజాకా. ఈ సూపర్‌స్టార్ ఏం చేసినా సంచలనమే. అడుగు తీసి అడుగేసినా, చింపిరి జుత్తు సరిచేసుకొన్నా, డైలాగ్ చెప్పినా చెప్పకున్నా ఫ్యాన్స్ గుడ్లప్పగించి చూస్తూనే ఉంటారు. అలాంటి రజనీ కాంత్ ట్విట్టర్లో ప్రవేశిస్తున్నాడు అని తెలియగానే ఫ్యాన్సంతా సంబరపడ్డారు. సోమవారం రజనీకాంత్ పేరున ఓ ట్విట్టర్ ఎకౌంట్ అఫీషియల్‌గా మొదలైంది. తొలి ట్విట్ చేసిన 24 గంటలు గడవకముందే దాదాపుగా రెండులక్షలమంది ఫాలోయిర్స్ని సంపాదించుకొన్నాడు రజనీ. అదీ రజనీకాంత్ స్టామినా అంటే. ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ కి ట్విట్టర్లో దాదాపుగా 80 లక్షలమంది ఫాలోయిర్స్ ఉన్నారు. ఆ రికార్డ్‌ని రజనీ బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. రజనీకాంత్ తలచుకొంటే ఏమైనా జరుగుతుంది. తలైవానా? మజాకానా??