పవన్ కల్యాణ్ రూ.18 కోట్లు తీసుకొంటున్నాడు అంటే.. మహేష్ బాబు రూ.20 కోట్లు తీసుకొంటున్నాడని మహేష్ బాబు ఫ్యాన్స్ అంటారు! పారితోషికంలో మా హీరోనే గొప్ప అంటూ పవన్, మహేష్ ఫ్యాన్స్ నానా యాగీ చేస్తున్నారు. అసలు రజనీకాంత్ పారితోషికం గురించి వింటే మన స్టార్స్ాయనకు చాలా దూరంలో ఉన్నారన్న విషయం తెలుస్తుంది. ఇంతకీ రజనీకాంత్ పారితోషికం ఎంతో తెలుసా..? రూ.40 కోట్లు. నమ్మశక్యంగా లేదు కదూ..? కానీ ఇది నిజం. రజనీ లెటెస్ట్ సినిమా లింగా కోసం రూ.40 కోట్లు తీసుకొన్నాడట. అయితే ఏక మొత్తంలో కాదు. పారితోషికంలో భాగంగా రూ.25 కోట్లు అందుకొన్నాడట. లాభాల్లో వాటా కూడా ఇవ్వాల్సిందేనట. ఒకట్రెండు ఏరియా హక్కులూ ఈ సూపర్‌స్టార్ దగ్గరే ఉంటాయట. అవన్నీ కలుపుకొంటే రజనీ కాంత్ పారితోషికం రూ.40 కోట్లకుపైనే ఉంటుందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. సో.. ఈ విషయంలో మొత్తం ఇండియాలోనే రజనీని కొట్టే మొనగాడు లేడు!