గృహ ప్రవేశం చేసిన బాలకృష్ణ!

balayya

బాలయ్య హిందూపురం వాసి అయిపోయాడు. స్థానికేతురుడంటూ.. ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు బాలయ్య సమాధానం చెప్పాడు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన హిందూపురంలో అద్దె ఇళ్లు తీసుకున్నాడు. అద్దె ఇంటిలో ఈ ఉదయం గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలసి పూజలు నిర్వహించారు. అయితే, త్వరలోనే హిందూపురంలో సొంత ఇల్లు తీసుకోనున్నట్లు బాలయ్య తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం పొందిన తరవాత బాలయ్య బాగ్యనగరాన్ని విడిచి హిందూపురంలోనే సెటిల్ అవుతారోమోనని ఆయన అబిమానులు గుసగుసలాడుతున్నారు.