విడాకులకు లివ్వండి !

hrithi roshan
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అతని భార్య సుజానేల వివాహ బంధం ముగిసింది. 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. తాజాగా తమకు డైవోర్స్ కావాలంటూ కోర్టులో వారిద్దరూ పరస్పర ఆమోదంతో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుపై నవంబర్ లో కోర్టు విచారణ చేపట్టనుంది. వ్యక్తిగత కారణాల వల్ల గతేడాది డిసెంబరు 14న తామిద్దరమూ విడిపోతున్నట్లు హృతిక్, సుజన్నేలు స్వయంగా మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.