పోలింగ్ కు 90 వేల మంది పోలీసుల భద్రత

dgp
రేపు(బుధవారం) తెలంగాణలో జరిగే పోలింగ్ కు 90 వేల మంది పోలీసులను వినియోగించనున్నట్టు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలింగ్ బందోబస్తుకు 158 కంపెనీల పారామిలటరీ బలగాలను వినియోగిస్తున్నామన్నారు. బందోబస్తు కోసం 59 కంపెనీల ఎపీఎస్పీ బలగాలను నియమించామన్నారు. ఎన్నికల్లో తనిఖీల కోసం నాలుగు వైమానికదళ హెలికాప్టర్లను వాడుతున్నామని తెలిపారు. ఇక, తనిఖీల్లో ఇప్పటి వరకు 123 కోట్ల రూపాయలు, 89 కేజీల బంగారాన్ని పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. 28 వేలకు పైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు. 3 లక్షల 7 వేల మందిని బైండోవర్ చేశామని వివరించారు.