మద్యం సిండికేట్ల పై గవర్నర్ సీరియస్

govrner
రాష్ట్రంలోని మద్యం సిండికేట్ల వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిండికేట్ల కేసులో విచారణ ఫైల్ ఏడాది కాలంగా ప్రభుత్వం దగ్గరే ఉండటాన్ని తెలుసుకున్న ఆయన సిండికేట్లతో చేతులు కలిపిన ఎక్సైజ్ అధికారులపై వేటు వేశారు. 34 మంది ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్లపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. సిండికేట్లతో సంబంధాలున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. అటు పోలీసు అధికారులపై కూడా చర్యలకు రంగం సిద్ధమైంది. 180 మందికి సంబంధించిన ప్రాసిక్యూషన్ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. ఈ కేసులో మిగతావారి విచారణకు త్వరలోనే అనుమతి వస్తుందని ఏసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.