బ‌న్నీ కోరిక తీర‌బోతోందా…?!

allu arjun

రేసుగుర్రం రిజ‌ల్ట్‌ తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు అల్లు అర్జున్‌. ఈ సినిమా వ‌సూళ్ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నాడు. ప‌నిలో ప‌నిగా అల్లు అర్జున్ కోరిక కూడా… ఈ సినిమా తీర్చబోతోంది. ఇంత‌కీ అల్లు కోరిక ఏమిటంటారా…?? అక్క‌డికే వ‌స్తున్నాం. బ‌న్నీ కెరీయ‌ర్‌లో హిట్లు, సూప‌ర్‌హిట్లు ఉన్నాయి. అయితే రూ.50 కోట్లు మార్క్ చేరుకొన్న సినిమా లేదు. క‌నీసం రూ.40 కోట్ల మైలురాయి కూడా అందుకోలేదు. రామ్‌చ‌ర‌ణ్ మాత్రం మూడు సార్లు ఈ మ్యాజిక్ ఫిగ‌ర్ చేరుకొన్నాడు. అన్నీకుద‌రితే.. రేసుగుర్రం బ‌న్నీ కెరీర్‌ లో రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి చిత్రం అవుతుంది. కనీసం రూ.40 కోట్లు సాధించినా బ‌న్నీ హ్యాపీనే. ఎందుకంటే బ‌న్నీ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ఫిగ‌ర్‌ నీ అందుకోలేదు. ఈ సినిమా రూ.40 కోట్ల మైలురాయి అందుకోవ‌డం సాధ్య‌మే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తొలి మూడు రోజుల్లోనే రూ.20 కోట్లు సాధించింది. వ‌చ్చే వారం కూడా పెద్ద సినిమాలేవీ లేదు. కుటుంబ ప్రేక్ష‌కులు రేసుగుర్రం చూడ‌డం ఇప్పుడే మొద‌లెట్టారు. సో.. రూ.40 కోట్లు ఈజీగా రీచ్ అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లేసేశాయి.