రూ.7 కోట్లు ప‌లికిన‌ రేసుగుర్రం

resugurram-audio1

శాటిలైట్ రేట్లు మ‌హాదారుణంగా ఉన్నాయి. టీవీ ఛాన‌ళ్లు గీచి గీచి మ‌రీ బేర‌మ‌డుతున్నాయి. అయితే ఇవ‌న్నీ చిన్న సినిమాల వ‌ర‌కే. పేరున్న క‌థానాయ‌కుల సినిమాలొస్తే, అందులోనూ హిట్ట‌యితే క‌ళ్ల‌క‌ద్దుకొని మ‌రీ కొంటున్నారు. రేసుగుర్రం శాటిలైట్ కూడా అలానే హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. అల్లుఅర్జున్ – సురేంద‌ర్‌రెడ్డి క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం రేసుగుర్రం. ఈ సినిమాకి ముందు నుంచీ మంచి టాక్ ఉంది. విడుద‌లైన తొలి ఆట నుంచే హిట్‌.. హిట్ అటున్నారంతా. అందుకే శాటిలైట్ మార్కెట్లోనూ మంచి రేటు ప‌లికింది. ఈ చిత్రానికి రూ.7 కోట్ల ధ‌ర వెచ్చించి శాటిలైట్ హ‌క్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకొంది. బ‌న్నీ సినిమాల్లో ఇదే హ‌య్య‌స్ట్ రేట్. తొలి మూడు రోజుల‌కూ రూ.20 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన రేసుగుర్రం.. వేస‌వి సెల‌వ‌ల ఫుణ్య‌మా అని సోమ‌వారం కూడా నిల‌క‌డైన వ‌సూళ్లు అందుకొంటోంది.