విక్ర‌మ్‌తో స‌మంత‌??

yxfegn9h

స‌మంత దూకుడు ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. తెలుగు, త‌మిళ రంగాల్లో ఏ పెద్ద హీరో సినిమా మొద‌లైనా.. క‌థానాయిక‌గా విపిపిస్తున్న మొద‌టి పేరు.. స‌మంత‌. ఆమె ఖాళీ లేదంటే అప్పుడు మ‌రో ఆప్ష‌న్ కోసం వెదుకుతున్నారు. స‌మంత బ్యాగ్‌లో ఇప్పుడు మ‌రో త‌మిళ చిత్రం చేరింది. త్వ‌ర‌లోనే విక్ర‌మ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంది. విక్ర‌మ్ – విజ‌య్ మిల్ట‌న్ క‌ల‌యిక‌లో ఓ త‌మిళ చిత్రం రూపుదిద్దుకోనుంది. మురుగ‌దాస్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌గా స‌మంత‌ని ఎంచుకొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం మ‌నోహ‌రుడు (ఐ) సినిమా తుది ప‌నుల్లో బిజీగా ఉన్నాడు విక్ర‌మ్‌. ఆ త‌ర‌వాతే.. సెట్స్‌పైకి వెళ్లే సినిమా ఇదే.