బాలయ్య చేతికి బి.ఫారం

balayya
సినీ హీరో బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న విషయం విదితమే. హైదరాబాదులో ఇవాళ తనను కలవడానికి వచ్చిన బాలకృష్ణకు చంద్రబాబు బి.ఫారం అందించారు. అనంతరం వీళ్లిద్దరి మధ్య ప్రచారానికి సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటు హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నామినేషన్ తర్వాత బాలయ్య ప్రచారానికి దిగుతారు.