భారత్ ను చూసి పాక్ నేర్చుకోవాలి!

nwd31la5

ప్రపంచ క్రికెట్లో భారత్ (బీసీసీఐ) అగ్రపీఠానికి చేరుకొంది. ఇందుకు భారత్ దూరదృష్టి, కచ్చితమైన ప్రణాళికలే కారణం అంటున్నారు పాకిస్థాన్ కోచ్ మొయిన్ ఖాన్. ఈ విషయం లో భారత్ ను చూసి పాక్ నేర్చుకోవాలని సూచించాడు. లేదంటే.. ఏ విషయంలోనూ పాక్ భారత్ తో పోటీపడలేదని పేర్కొన్నాడు. బీసీసీఐ అద్భుత ప్రణాళిక, భారత ఆటగాళ్ల మానసిక స్థైర్యం బీసీసీఐను, టీంఇండియాను అగ్రస్థానానికి తీసుకెళ్లిందని చెప్పాడు. ఇక, ఐపీఎల్ భారత ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని మొయిన్ అన్నారు. ఇకనైనా… పాక్ సొంతంగా సూపర్ లీగ్ టీ20ని ప్రారంభించాలని అనుకోవడం సంతోషదాయకం అని మొయిన్ చెప్పాడు.