మంచు హీరో ఢీ కొడుతున్నాడు

pbcirq5h

విల‌న్ గా జ‌గ‌ప‌తిబాబు కెరీర్ మంచి స్పీడు మీద ఉంది. ఏ ముహూర్తంలో లెజెండ్ ఒప్పుకొన్నాడో గానీ… అప్ప‌టి నుంచీ జ‌గ‌ప‌తిబాబు విల‌న్ పాత్ర‌ల‌కు ఓ ఆప్ష‌న్ అయిపోయాడు. పిల్లా నువ్వులేని జీవితం, రారా కృష్ణ‌య్య సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఆగ‌డు, పండ‌గ చేస్కో చిత్రాల్లోనూ ప్ర‌తినాయ‌కుడిగా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని స‌మాచార‌మ్‌. ఈ జాబితాలో ఇప్పుడో కొత్త చిత్రం చేరింది. మంచు మ‌నోజ్‌తో త్వ‌ర‌లోనే జ‌గ‌ప‌తిబాబు ఢీ కొట్ట‌బోతున్న‌ట్టు టాక్‌. జి. నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మ‌నోజ్ న‌టిస్తున్నాడు. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబుని ఎంచుకొన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. ప్ర‌స్తుతం లెజెండ్ విజ‌యంతో ఖుషీలో ఉన్నాడు జ‌గ‌ప‌తి. ”ఇండ్ర‌స్ట్రీ న‌న్ను చాలాసార్లు త‌రిమేయాల‌ని చూసింది. కానీ ప్ర‌తిసారీ నిల‌దొక్కుకొన్నా. లెజెండ్‌ తో నాకు కొత్త రెక్క‌లొచ్చాయి..” అంటున్నాడు జ‌గ‌ప‌తి. రెక్క‌లు రావ‌డ‌మే కాదు… ఇప్పుడు కొత్త ఆఫ‌ర్ల‌తో స్వేచ్ఛ‌గా విహ‌రిస్తున్నాడు కూడా.