భయం పుట్టిస్తున్న కోచ్చడయాన్

rajani
రజనీకాంత్ ఇమేజ్ చాలా విచిత్రమైంది. సీన్ మీద రజనీ కటింగ్ లు, చుట్ట ఎగరేయడాలు, కండువాలను గాలిలో తిప్పడాలు, వెనకన ఆ సౌండ్ వెరసి రజనీది చాలా పెక్యూలియర్ పెరఫారమెన్స్ ఆ ట్రెండ్ తోనే రజనీ మొదటినుంచి కొట్టుకుంటూ ఈ స్థాయికి వచ్చి, అత్యన్నతస్థాయికి నిలబడ్డారు. రజనీ వస్తే చాలు, రజనీ కటింగ్ ఇస్తే చాలు తమిళ ఆడియన్స్ వెర్రెక్కిపోతారు. తెరలు చింపిస్తారు. అటువంటి ఇమేజ్ ఇండియన్ సినిమాలోనే ఎవ్వరికీ లేదు. రాలేదు. రోబో కి ఎంతో ముదుగానే రజనీకీ రోబో ఇమేజ్ వచ్చేసింది. మనమంతా రోబోలో రజనీలో ఏం చూసామో, దాన్నే రజనీలో మనం అంతకు ముందు నుంచీ చూస్తూ వస్తున్నాం. అంటే రజనీ ఇమేజ్ కీ, స్టయిల్ కీ ఇదమిద్ధమైన విధానం లేదు.

మిగతా హీరోలు, వారు ఏ భాషకు చెందినవారైనా కావచ్చు, అందరూ ఓ స్పష్టమైన పాత్రని ఎంపిక చేసుకుని సినిమాలకు సైన్ చేస్తారు. రజనీ అలా కాదు. రజనీయే ఒక పాత్ర. రజనీయే ఒక స్టయిల్ రజనీయే ఒక ట్రెండ్ వెరసి, రజనీయే ఒక పాత్ర. కావాలంటే చూస్కోండి…..గత వంద చిత్రాల్లో రజనీ, రజనీ పాత్రనే చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ హిట్లు ఇస్తున్నారు. దర్శకులు కూడా రజనీనే ఓ క్యారెక్టర్ గా కథ రాసుకుంటారు. ఆ క్యారెక్టర్ కీ రజనీ లక్షణాలన్నిటినీ తీరిగ్గా అద్దుతారు. రజనీ స్టయిల్ ని ఇంజక్ట్ చేస్తారు. దానిపైన ఆదారపడే సన్నివేశాలను రాసుకుంటారు. రజనీ స్ర్టోక్ కి సరిపోయిన మలుపులు, ట్విస్ట్ ల్నీ ప్రతీరీలులోనూ ఓపిగ్గా రుద్దుతారు. ఫైనల్ గా రజనీనే మనం చూస్తాం. అంటే రజనీ ఓ రోబోలా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. దానికే ఈలలు, చప్పట్లు, అరచేతిలో కర్పూరాలు, తల్లకిందులుగా తెరముందు తైతక్కలు.

ఇటువంటి ఇమేజ్ ప్రపంచ చలన చిత్రచరిత్రలో ఉన్న లెజెండ్ ఒక్కడే ఓక్కడు. అదే చార్లీచాప్లిన్ చార్లీ ఏ చిత్రంలోనైనా ఒక్కటే. మరో చాప్లిన్ ఎలా ఉంటాడో చాప్లిన్ కూడా చూడలేదు. ఊహించలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ఆ ఇమేజ్ వచ్చిన ఏైక నటుడు ఒక్క రజనీయే. అందుకే రోబో పాత్ర అంత పెద్ద హిట్ అయింది. ఒకడితో సంబంధం లేకుండా రోబోలో రోబో ఎలా తన పని తాను చేసుకుంటూ పోతూ కూడా హీరోయిజమ్ ని మిస్ కాకుండా కోట్టుకోట్లు కురిపించింది రోబో క్యారెక్టర్ అదుకే జపాన్ లో రోబో వచ్చిన టైంలో ఒక ఎక్స్ ప్రెషన్ బైటకొచ్చింది. రజనీ నటించిన చిత్రానికి రోబో అని పేరు పెడితే, రాబోయే యుగంలో రోబోలు తీసే సినిమాకి రజనీకాంత్ అని పేరు పెడతారన్నదే ఆ ఎక్స్ ప్రెషన్.

అయితే రోబో ఎంత పెద్ద హిట్ అయిందో, అంతకన్నా ఎక్కువ భయాన్ని కూడా రోబో రేపింది. అదేంటంటే రోబో తర్వాత రజనీ చేత ఎటువంటి క్యారెక్టర్ చేయించాలి, ఎటువంటి పాత్రను రాయలీ అనేదే ఆ భయం. ఆ భయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే, రజనీ కూతురు మరో తీవ్రమైన ప్రయోగంతో వస్తోంది. అదే కోచ్చడయాన్ శంకర్ రజనీని రోబోని చేస్తే, రజనీ కూతురు మరో అడుగు మందుకెళ్ళి, ఏకంగా రజనీని కార్టూన్ ని చేసేసింది. ఈ ప్రయోగం ఎంత గొప్పదో, అంత ప్రమాదకరమైనది. ఎందుకంటే రజనీని కార్టూన్ గా కూడా ప్రేక్షకులు స్వీకరిస్తారు. ధియేటర్ల ముందు మోకరిల్లుతారు. హైటెక్నిక్ తో వస్తోంది కాబట్టి, యంగ్ జనరేషన్ పిచ్చెక్కిపోతారు. చిన్నపిల్లలు కూడా రెచ్చిపోతారు. దీని తర్వాత రజనీతో సినిమా చేయాలంటే కష్టాలే. రజనీ అన్ని సినిమా పరమైన అన్ని వలయాలను, ఎల్లలను దాటుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు.పోతున్నారు. ఈ త్రిడి మెస్మరిజమ్ ఇప్పటికే రెగ్యలర్ సినిమా కొంప ముంచుతోంది. గ్రాఫిక్స్ మరింత మామ్మూలు సినిమా నడుం విరగ్గొడుతోంది.

అందుకే అవతార్ లాటి సినిమాలకి ఎక్స్ పోజ్ అవుతున్న రెగ్యులర్ ఆడియన్స్ కి మన హీరోలు, మన చిత్రాలు బఫూన్ లు లాగా కనిపిస్తున్నాయి. ధియేటర్లకి తండోపతండాలుగా ప్రేక్షకుల్ని రప్పంచగలిగే రజనీలాటి వాళ్ళు రోబోలు, కార్టూన్ లు అయిపోతే, మామ్మూలు సినిమాలు ఎవడు చూస్తాడు. అందుకే త్వరలో రజనీతో సినిమా చేయబోతున్న కె.ఎస్ రవికుమార్ నానా ఛావు చచ్చి తన తదుపరిచిత్రానికి కథని తయారు చేసుకున్నాడు. అదే….కథంటే ఓ డిఫరెంట్ రజనీని. రజనీతో ఎన్నో హిట్లు ఇచ్చిన రవికే మింగుడు పడడం లేదు. అయితే రజనీలో కూడా ఈ సంశయం ఉండబట్టే రవికుమార్ కథని వెంటనే ఓకే చేశాడని ఓ టాక్.