తాగి పట్టుబడ్డ సినీ రచయిత!

BVS Ravi

టాలీవుడ్ ప్రముఖ సినీరచయిత బీఎస్ రవి పోలీసుల చేతిలో బుక్ అయ్యాడు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో రవి పోలీసుల చేతికి పట్టుబడ్డాడు. శుక్రవారం రాత్రి ఫిలింనగర్ వద్ద పోలీసులు డ్రింక్ అండ్ డ్రవ్ నిర్వహించారు. రవి మధ్యం సేవించి కారు డైవింగ్ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు. దీంతో… పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, రవితో పాటుగా అదేకారులో వున్న హీరో రవితేజ, హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, మరికొందరు వేరే వాహనంలో వెళ్లిపోయారు. కాగా, అదే మార్గంలో ప్రయాణించి రాజకీయనాయకులను పోలీసులు చెక్ చేయకుండా వదిలేయడం విశేషం.