రామ్ చరణ్ పై కేసు

charan ram
హీరో రామ్ చరణ్ పై పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో బుధవారం కేసు నమోదైంది. ఇటీవల రాంచరణ్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జూబ్లిహిల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిరంజీవి అభిమాన సంఘం పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడం..ఫ్లెక్సీల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1997చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ అధికారుల అనుమతి తీసుకోవాలి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో కేసు నమోదు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలో రాంచరణ్ పై పోలీసులు కేసు నమోదయ్యంది.