ఎన్నికల బరిలో బాలయ్య!

balayya(1)

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు బాలయ్య సంకేతాలిచ్చారు. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి రావాల్సి ఉందన్నారు. ఈరోజు (సోమవారం) ఉదయం బాలకృష్ణ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య విలేకరులతో మాట్లాడుతూ..  పార్టీ ఆదేశిస్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు. ఎక్కడ పోటీ చేయాలా అన్న దానిపై చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ’లెజెండ్’ సక్సెస్ టూర్ల ద్వారా ప్రేక్షక దేవుళ్లను కలుసుకుంటానని అన్నారు. ఎన్నికల బరిలోకి దిగుతానని స్వయంగా బాలయ్యనే ప్రకటించడంతో.. ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.