ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ లో తలమునకలై ఉన్నాడు ప్రభాస్. అయితే ఆ తరవాత చేయబోయే సినిమాల గురించీ ప్రణాళికలు వేసుకొంటున్నాడు. ఈసారి లైట్ ఎంటర్ టైన్మెంట్ చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. అందుకే శ్రీనువైట్లలాంటి దర్శకుడితో జత కట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే మన దర్శక నిర్మాతలు ప్రభాస్ ని యాక్షన్ హీరోగానే ప్రజెంట్ చేయాలని పరితపిస్తున్నారు. ప్రభాస్ కోసం ఓ కథ రెడీ అవుతోంది. కన్నడలో విజయవంతమైన ‘ఉగ్రం’ సినిమాని ప్రభాస్ తో తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా?? ఆని ఆలోచిస్తున్నారట. ఓ పెద్ద నిర్మాత ఈ సినిమాని రైట్స్ ని కొనుగోలు చేసి, ఆ సినిమాని ప్రభాస్ తో తీయాలని ఆశ పడుతున్నాడు. ఈ విషయమై ప్రభాస్ తో కూడా సంప్రదింపులు మొదలయ్యాయి. సినిమా చూసి, నచ్చితే అప్పుడు ఆలోచిస్తానని ప్రభాస్ మాటిచ్చాడట. ప్రభాస్ కి ‘ఉగ్రం’ నచ్చితే… తెలుగులో మరో రీమేక్ స్టోరీ పట్టాలెక్కినట్టే.