నేడు తెదేపాలో చేరనున్న ఆర్. కృష్ణయ్య!!

r.krishnaiah

బీసీల సంక్షేమం కోసం ఇన్నాళ్లు పోరాడిన ఆర్. కృష్ణయ్య ఇక రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. నేడు తెదేపా తీర్థం పుచ్చుకోనున్నాడు. బీసీలకు 100 అసెంబ్లీ స్థానాలు, బీసీ వ్యక్తినే తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తానని తెదేపా ప్రకటించిన విషయం తెలిసిందే. నేపథ్యంలో.. గతకొద్దికాలంగా ఆర్. కృష్ణయ్య తెదేపాకు సంపూర్ణ మద్దతు పలుకుతూ వచ్చారు. తాజాగా, నేడు (శుక్రవారం) తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నాడు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టిన కృష్ణయ్య తెదేపా దరికి చేరడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ప్రకటించే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కష్ణయ్యతో పాటుగా పలువురు బీసీ నేతలు నేడు తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు.