బ్రహ్మానందం పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా? త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడా? ఫిల్మ్‌నగర్ లో ఈ విషయం గురించి ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. త్వరలోనే బ్రహ్మానందం మోడీని కలుసుకోబోతున్నారని తీర్మాణించేశారు. పవన్, నాగ్, మోహన్ బాబు… ఇలా మోడీకి జై కొట్టినవారి లిస్టులో బ్రహ్మానందం పేరు కూడా చేర్చేశారు. అయితే ఈ వార్తల్ని ఖండించారు బ్రహ్మానందం. తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదని, తాను ఏ పార్టీకీ వత్తాసు పలకాలనుకోవడం లేదని చెప్పేశారు. “నా సహచర నటులు కోట, బాబూ మోహన్ రాజకీయాల్లోకి వెళ్లారు. నాకు ఆసక్తి ఉంటే నేనూ అప్పుడే వెళ్లేవాడిని. కానీ రాజకీయాల గురించి నాకు తెలీదు. ఈ వార్తలు ఎందుకొచ్చాయో అర్థం కావడం లేదు“ అని క్లారిటీ ఇచ్చేశారు బ్రహ్మానందం.