మల్కాజిగిరి.. మహా హాట్!!

malkajgiri

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో…. రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత వేడెక్కుతోంది. నేతల హాడావుడి అంతా ఇంతా కాదు. సీట్లకోసం నేతల.. పడిగాపులు, పార్టీ ఫిరాయింపులు షరామాములే. ఇదలావుంచితే.. నేతలు తమకు నచ్చిన, అచ్చొచ్చిన నియోజవర్గాలు, ఎంపీ స్థానాలకు కర్చిప్ వేసుకుంటున్నారు. మిగితా ఎంపీ స్థానాల విషయం ఎలావున్నా.. ఈసారి అందరి చూపు మల్కాజిగి పార్లమెంట్ స్థానంపైనే నెలకొంది.

లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మల్కాజిగి నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలే ఈ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టి కూర్చున్నారు. ఇక తెదేపా అధినేత చంద్రబాబు నాయుడి ఇక్కడి నుంచి బరిలోకి దిగితే బాగుంటుందని తెలుగు తముళ్లు ఆశపడుతున్నారు. తాజాగా, అదే పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఈ స్థానంపై తనకున్న మక్కువను బయటపెట్టాడు.

రాజకీయనేతల హడావుడి ఎలావున్నా.. ఇటీవలే జనసేన పార్టీని నెలకొల్పిన పవన్ కళ్యాణ్ మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ పోటీలో వుంటే.. మిగితా నేతలు తప్పుకునే అవకాశాలున్నాయి. కానీ, ఇప్పటికి వరకు పవన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. పవన్ పోటీవుంటే.. వార్ వన్ సైడే.. లేదంటే మల్కాజిగిరిలో పొలిటికర్ వార్ ఓ రేంజ్ లో వుండబోతుందన్న దాంట్లో సందేహం లేదు. మొత్తానికి.. ఈసారి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం మహా హాట్ మారిందిన్న మాట.