పవన్-మోడీ దోస్తీ కుదిరేనా… ??

pawan-modiజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు (శుక్రవారం) భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. పవన్ గురువారమే గాంధీనగర్ చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా, భాజాపా, జనసేన జతకట్టనున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఈ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది. జనసేన పార్టీ లక్ష్యాలు, పార్టీ ద్వారా తాను చేయాలని భావించిన అంశాలను పవన్ మోడీకి వివరించే అవకాశం వుంది.

పవన్-మోడీ ఇద్దరి నినాదం కూడా ఒక్కటే ’కాంగ్రెస్ కో హఠావో- దేశ్ కో బచావో’. ఈ నేపథ్యంలో.. పవన్ – మోడీ దోస్తీ కట్టేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నది రాజకీయ విశ్లేషకులు భావన. ఇక పవన్ ప్రస్తావిస్తున్న అవినీతిపై కూడా మోడీ చాలాకాలం నుంచి గొంతుచించుకొని అరుస్తున్నాడు. పవన్ ప్రధానమైన లక్ష్జ్యం కూడా అవినీతిని అంతమొందించి.. నీతివంతమైన పాలనను అందించేందుకు సహాయపడటమే. పవన్ – మోడీల దోస్తీ కుదిరితే రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రం కూడా మారవచ్చు. రాష్ట్రంలో కొత్త పొత్తులు ఉదయించవచ్చు. అదే జరిగితే.. తెదేపా, భాజాపా, జనసేన, లోక్ సత్తాల మాహా కూటమి కాంగ్రెస్ పై దండయాత్రకు దిగవచ్చు. కాగా, ఇటీవలే పవన్ చేసిన పవర్ ఫుల్ స్వీచ్ మోడీకి విపరీతంగా నచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది..