‘జన సేన’ పబ్లిక్ మీట్

pavan
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈనెల 29న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ సభలో జనసేన విధి విధానాలను స్పష్టంగా వెల్లడించని పవన్ కళ్యాణ్.. విశాఖలో జరిగే సభలో వాటన్నింటిని సమగ్రంగా ప్రజల ముందు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఐడియాలజీ ఆఫ్ జనసేన పేరిట తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి రచించిన ‘ఇజం’ పుస్తకాన్ని కూడా ఈ సభలోనే ఆవిష్కరించనున్నారు.