డీఎల్ సైకిల్ ఎక్కేశాడు..!!

dl-joined-tdpమాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సైకిల్ ఎక్కడం కన్ ఫామ్ అయిపోయింది. తాజాగా, డీఎల్ మైదుకూరులోని తెదేపా కార్యాలయానికి వచ్చి పురపాలక సంఘం ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికల ప్రకియలో పాలుపంచుకుంటున్నారు. కాగా, డీఎల్ త్వరలోనే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఘనంగా తెదేపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డీఎల్ రాకతో కడపలో తెదేపా మరింత పుంజుకునే అవకాశాలున్నాయని ఖుషి అవుతున్నారు తెలుగు తముళ్లు.