సినిమా వేడుకలకు వచ్చినప్పుడల్లా.. ఏం మిస్ అవుతున్నారో చిరుకి అర్థమవుతోంది. అందుకే సినిమాలపై తనకున్న ప్రేమను ఆడియో వేడుకల్లో బయటపెట్టేస్తుంటారు. ‘రేసుగుర్రం’ ఆడియో పండగలోనూ… చిరుకి సినిమాలపై ఉన్న ప్రేమ కనిపించింది. ఆయన ఇటీవల ఓ సినిమా చూశారట. అది మనసుకి బాగా నచ్చేసిందట. అయ్యో ఇలాంటి సినిమా నేనెందుకు చేయలేకపోయానా?? అనిపించిందట. ఆ సినిమా… కిక్. ఈ విషయాన్ని చిరు స్వయంగా చెప్పుకొచ్చారు. ”పది, పదిహేను రోజుల క్రితం కిక్ చూశా. చాలా బాగా నచ్చింది. కాసేపు చూసి, ఛానల్ మారుద్దామనుకొంటే…. ఆ సినిమా కూర్చోబెట్టేసింది. సినిమా మొత్తం చూశా. రవితేజ చేసేశాడు గానీ.. నేను చేస్తే బాగుండును కదా అనిపించింది. సురేందర్‌రెడ్డి లాంటి దర్శకులు.. మనకు కావాలి. అప్పుడే కొత్త కథలొస్తాయి. కథ కంటే.. అతని స్ర్కీన్ ప్లే నచ్చింది. ఫ్లాష్ బ్యాక్ చెప్పే విధానం ఆకట్టుకొంది” అని కితాబిచ్చాడు చిరు.