దేవుళ్లను వదిలేయండి – పవన్ ను ఫాలో అవండి : వర్మ

rgv comments on pawan jana sena’జనసేన పార్టీ’ అధినేత పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంతెచ్చారు క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. పవన్ ’జనసేన పార్టీ’ ప్రకటన అనంతరం వర్మ తనదైన శైలి స్పందించారు. “నాకు దేవుడి మీద నమ్మకం లేదు. కానీ పవన్ అలా కనిపిస్తున్నాడు. తెలుగు ప్రజలకు నిజంగా బుర్ర ఉంటే.. దేవుళ్లను వదిలేసి పవన్ ను ఫాలో అవ్వండి” అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. కాగా, గతంలో పవన్ పొలిటిక్స్ లోకి రావాల వర్మ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ రాజకీయాల్లోకి వస్తే మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటానని కూడా వర్మ తెలిపారు. మరీ..పవన్ పొలిటికల్ ఎంట్రీ ముగిసింది.. వర్మ మొదటిసారి ఓటు వేసి మాట నిలబెట్టుకుంటాడో లేదో.. !!