పవర్ తో పనిలేదంటున్న పవర్ స్టార్.. !!

pawan-janasenaరాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకొస్తారు. పవర్ కోసం. లక్షల కోట్ల డబ్బులున్నా.. పవర్ కోసం పొలిటికల్ పార్టీల చుట్టూ పదక్షిణలు చేస్తారు. కానీ.. “పవర్ కోసం కాదు.. ప్రశ్నించడం కోసమే” అంటూ ఎన్నికల బరిలో దిగాలని పట్టుదలతో వున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

’జనసేన పార్టీ’ కేవలం ప్రశ్నించడానికే మాత్రమే అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టేశాడు. రాజకీయ నాయకులను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని ఎంతో మంది యువకులు రెడీగా వున్నారు. కానీ, వారికి సరైన వేదిక దొరకడం లేదు. ఇప్పుడు పవన్ రూపంలో ఓ అద్భుతమైన వేదిక దొరికింది. అదే పవన్ ’జనసేన పార్టీ’. అందుకే పవన్ పార్టీపై ప్రకటన కూడా ఇంకా చేశాడో లేదో యువత నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పవర్ కోసం కాదు ప్రశ్నించడానికి మాత్రమే అని చెప్పే ధైర్ఘ్యం లేని ప్రస్తుత రాజకీయాల్లో పవన్ పొలిటికల్ ఎంట్రీ నిజంగా ఓ అద్బుతంలాంటిదే.

సోషల్ నెట్ వర్క్ మీడియాలో ఎక్కడ చూసిన పవన్ ’జనసేన’ గురించే. దీనిలో భాగస్వామ్యుల్యేవారంతా యువతే కావడం విశేషం. యువత ఆవేశం, ఆలోచనకు సరిగ్గా సరిపోయేలా రూపుదిద్దుకుంటోన్న పవన్ జనసేన (పీపుల్స్) పార్టీకి యువత బ్రహ్మారథం కట్టనున్నారనేది సుస్పష్టం. ప్రశ్నించడానికి ప్రజల ముందుకు వస్తున్న పవన్ ను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు, తమ తరుపున పవన్ ప్రశ్నించమని ఎన్ని ప్రశ్నలు వేస్తారు.. తదితర విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజు ఆగాల్సిందే.