త‌రుణ్ `యుద్ధం` చేసినా…

tarunపేరుకు త‌గ్గ‌ట్టే… అనేక యుద్దాలు చేసి మా సినిమాని ఈ శుక్ర‌వారం విడుద‌ల చేస్తున్నాం.. అని త‌రుణ్ చెప్పాడు. అయితే.. మ‌రోసారి ఈ యువ హీరోకి మొండిచెయ్యే ఎదురైంది. త‌రుణ్ సినిమా ఈవారం కూడా విడుద‌ల కాలేదు. అందుకు కార‌ణం.. థియేట‌ర్లు దొరక్కేన‌ని నిర్మాత న‌ట్టికుమార్ చెబుతున్నారు. ఈ చిత్రానికి నైజాంలో థియేట‌ర్లు దొరికాయ‌ట‌. అయితే ఆంధ్రా, సీడెడ్ ల‌లో థియేట‌ర్లు అందుబాటులో లేవ‌ట‌. చిత్ర‌ప‌రిశ్ర‌మ న‌లుగురు నిర్మాత‌ల చేతుల్లో బంధీ అయిపోయింద‌ని, మంచి సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌డం లేద‌ని, నా సినిమాని కావాల‌నే అడ్డుకొంటున్నార‌న్న‌ది న‌ట్టికుమార్ ఆరోప‌ణ‌. ఈవారం బంగారు కోడి పెట్ట మిన‌హా సినిమాలేం విడుద‌ల కాలేదు. అదేమైనా భారీ రిలీజా..? అంటే అదీ లేదు. అలాంట‌ప్పుడు యుద్ధం సినిమాకి థియేట‌ర్లు దొర‌క్క‌పోవ‌డం ఏమిటీ? విడ్డూరం కాక‌పోతే…? ఈవిష‌యాన్ని న‌ట్టికుమార్ గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తాడ‌ట‌. అక్క‌డా న్యాయం జ‌ర‌క్క‌పోతే.. అస‌లు సినిమాలే తీయ‌న‌ని బెదిరిస్తున్నాడీ నిర్మాత‌. పాపం.. ఆయ‌న ప‌రిస్థితి ఏమోగానీ, హీరో త‌రుణ్‌కి మాత్రం ఏదీ క‌ల‌సిరావ‌డంలేదు. యుద్దాలు చేసినా సినిమాలు రిలీజ్ కావ‌డం లేదు. బ్యాడ్‌టైమ్ అంటే ఇదే…!