ప‌వ‌న్… సినిమాల మాటేంటి?

pavanప‌వ‌న్ ఇప్పుడు రాజ‌కీయ మంత‌నాల‌తో బిజీ. అత్తారింటికి దారేది త‌ర‌వాత ఆయ‌న సినిమాలు రెండు సెట్స్ పైకి వెళ్లాయి. అయితే ఒక్క‌టీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోవ‌డం లేదు. ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయం అవ్వ‌డంతో… ఆ రెండు సినిమాల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. గ‌బ్బ‌ర్ సింగ్ 2, ఓమైగాడ్ సినిమాలు ఇప్పుడు సందిగ్థంలోప‌డ్డాయి. గ‌బ్బ‌ర్ సింగ్ 2 సినిమా దాదాపుగా ఆగిపోయిన‌ట్టే. ఓ మైగాడ్ లో ప్ర‌స్తుతానికి ప‌వ‌న్ లేని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది. మే వ‌ర‌కూ ప‌వ‌న్ ఎన్నిక‌ల హ‌డావుడిలోనే ఉంటాడు. ఆ త‌ర‌వాత ప‌రిస్థితి ఇప్పుడే అంచ‌నా వేయ‌లేం. ఒక‌వేళ ప‌వ‌న్ ఎంపీగా గెలిస్తే… కొంత‌కాలం వ‌ర‌కూ మేక‌ప్‌కి దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. ఓమైగాడ్‌కి క‌నీసం మ‌రో హీరో అయినా దొరుకుతాడు. గ‌బ్బ‌ర్ మాత్రం అట‌కెక్కే ప్రాజెక్ట్‌లానే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో రాణిస్తాడా? గెలుస్తాడా? అన్న విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్ సినిమాలు చూద్దాం అనుకొన్న అభిమానుల‌కు ఇది చేదు వార్తే.