బాల‌య్య వ‌న్‌మేన్ షో… లెజెండ్‌

legendట్రైట‌ర్ తో అద‌ర‌గొట్టాడు బోయ‌పాటి శ్రీను. బాల‌కృష్ణ‌ను అభిమానులు ఏవిధంగా చూడాల‌నుకొంటున్నారో… అలానే ఆవిష్క‌రించాడు. బాల‌య్య డైలాగులు, మేన‌రిజం… ఇవ‌న్నీ లెజెండ్ ట్రైట‌ర్‌ని సూప‌ర్ హిట్ చేశాయి. ముఖ్యంగా.. దేవిశ్రీ ఆర్‌. ఆర్ గురించి చెప్పుకోవాలి. ట్రైలర్ ముందు నుంచీ చివ‌రి వ‌ర‌కూ ఓ టెంపోని కొన‌సాగించాడు. సింహాలో త‌న డైలాగుల‌తో రెచ్చిపోయిన ర‌త్నం.. ఈ సినిమాలోనూ బాల‌య్య బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా డైలాగులు రాశాడు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. – అనే డైలాగ్ అయితే బాల‌య్య ఫ్యాన్స్‌కి పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. సింహా ట్రైట‌ర్ త‌ర‌వాత బాల‌య్య అభిమానుల‌కు అంత‌గా న‌చ్చిన ప్ర‌చార చిత్రం ఇదే కావ‌చ్చు. దాంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. సింహా రేంజు విజ‌యాన్ని ఆశిస్తున్నారు. మ‌రి బాల‌య్య ఏం చేస్తాడో చూడాలి. ట్రైట‌ర్‌లోలానే వ‌న్ మ్యాన్ షో చూపిస్తే.. సింహారికార్డులే కాదు… మొత్తం అన్ని రికార్డులూ లెజెండ్ ఎగ‌రేసుకుపోవ‌చ్చు.