సింహపురిలో ’తెదేపా ప్రజాగర్జన’

tdp(2)అవినీతి, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టేందుకు ప్రజాగర్జనను అస్త్రంగా చేసుకున్నారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. సింహపురి వేదికగా కాంగ్రెస్, వైసీపీ, టీఆర్‌ ఎస్ పార్టీల వైఖరిని ఎండగట్టనున్నారు. ఈ రోజు (బుధవారం) నెల్లూరులో తెదేపా ప్రజాగర్జన జరగనుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వటం, నేడు లోక్ సభ సాదారణ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. సింహపురిలో ఈరోజు జరగనున్న తెదేపా ప్రజాగర్జన మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది. మరోవైపు ఇదే సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు.

వలసలపైన తెలుగుదేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. తండోపతండాలుగా నేతలు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొంత మందికే స్వాగతం పలుకుతోంది. సమర్థత, పార్టీ అవసరాలు, రాజకీయ సమీకరణాలకు తోడు వివాదరహితులైన వారికే పార్టీ తీర్థం ఇస్తోంది. వలసలపైన అక్కడక్కడ పార్టీలో అసంతృప్తులున్నప్పటకీ నేతల మధ్య సమన్వయం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.