మార్చి రెండో వారంలో పవన్ పార్టీ ??

pavanపవన్ కళ్యాణ్ పోలిటిక్స్ లోకి వస్తున్నారు ?
పవన్ ఓ పార్టీలో చేరుతున్నారు ? లేదు ఆయనే ఓ పార్టీ పెడుతున్నారు ?
పవన్, చిరు ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి..?
పవన్ గురించి ఈ మధ్య కాలంలో విపిస్తున్న కధనాలివి. అయితే, వీటికి పై క్లారీటి ఇవ్వడానికి ఏకంగా పవన్ రంగలోకి దిగుతున్నారు. ఈమేరకు తన పీఆర్వో ద్వారా ఓ ప్రకటన విడుద‌ల చేశారు. ఈ ప్రకటనలో.. తనకు, తన అన్నయ్యకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు. పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ అంశాలపై త్వరలోనే స్పందిస్తానని ప్రకటించారు. ఈ నెల రెండో వారంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

దాంతో అటు రాజ‌కీయంగా, ఇటు సినీ వ‌ర్గాల్లోప‌వ‌న్ ప్రెస్‌మీట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రెస్ మీట్ లో ఏం  పవన్ చెబుతాడో అనే ఆస‌క్తి నెలకొంది. మరో వైపు పవన్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి తనకు అత్యంత సన్నిహితులైన వారితో పవన్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సామాజిక స్పృహ కలిగిన పవన్ కల్యాణ్ తన లక్ష్యాలను రాజకీయాల ద్వారానే చేరుకోగలనని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఆయన పార్టీ పెడతార లేక ఏదైనా పార్టీలో చేరుతార అనేది తెలియాల్సి వుంది. పవన్ ప్రెస్ మీట్ లో ఇందుకు సంభందించి పూర్తి క్లారీటీ వచ్చేస్తోంది.